- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి
నేటి సాక్షి, వరంగల్: వరంగల్లోని వై ఆకారం ఫ్లైఓవర్ బ్రిడ్జికి తక్షణమే మరమ్మతులు చేయాలని సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి కోరారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బ్రిడ్జిపై పడ్డ గుంతలకు రెడ్ మార్క్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వై ఆకారం ఫ్లైఓవర్ బ్రిడ్జి అధికారులు కాంట్రాక్టుర్ల వల్ల మెటీరియల్ నాణ్యతగా లోపం వల్ల నిర్మించారని, దీంతో కొద్ది నెలల్లోనే గుంతలు పడ్డాయని పేర్కొన్నారు. రాడ్లు పైకి తేలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు గాయపడి, దవాఖానల పాలైన ఘటనలున్నాయని చెప్పారు. వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు నిలిచి, ఏర్పడకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రతన్ గౌడ్, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, శంకర్, వైకుంఠం మురళి తదితరులు పాల్గొన్నారు.

