- కొత్త రేషన్ కార్డులు అప్లై దరఖాస్తు చేసుకునే వీలు లేదు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ప్రకటనలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు దరఖాస్తులు మీసేవలో చేసుకోవచ్చు అని ప్రకటించిన పౌర సరఫరాల శాఖ. కానీ పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో మాత్రం దరఖాస్తు అందుబాటులో లేదు అంటూ చూపిస్తున్న వైనం
ప్రకటనలు చేసి ఎందుకు మా సమయం వృధా చేస్తారు, ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు మాకు ఆశ కలిగించడం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..కొత్త రేషన్ కార్డులకు షాక్,కొత్త రేషన్ కార్డుల కోసం మీ-సేవ అధికారులు స్పష్టత నివ్వలేక పోతున్నారు.కొత్త రేషన్‌కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరించాలని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంతలోనే షాక్ ఇచ్చింది. ఆన్లైన్ ద్వారా నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ఎంతో ఆశతో మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. కానీ పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో మాత్రం దరఖాస్తు అందుబాటులో లేదు అంటూ చూపిస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు ఆన్లైన్ ఎఫ్ ఎస్ సి లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మీ సేవ కేంద్రాలకు పరిగెత్తిన ప్రజలకు నిరాశ ఎదురయింది.దీంతో కొత్త రేషన్ కార్డులు కావలసి నవారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవడం లేదని ప్రజలకి సమాచారం అందించారు. దీంతో మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రకటనలు చేసి ఎందుకు మా సమయం వృధా చేస్తారు, ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు మాకు ఆశ కలిగించడం ఎందుకు, మమ్మల్ని పరుగులు తీపిస్తున్నారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభలో తీసుకున్నారు. ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరని ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.





