నేటి సాక్షి, వేమనపల్లి : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ జడ్పిటిసి ఆర్.సంతోష్ కుమార్ అన్నారు.శుక్రవారం మండలంలోని కేతనపల్లి, గొర్లపల్లి, దస్నాపూర్, సుంపుటం, వేమనపల్లి గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన రూ. 80లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబిర్ అలీతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తవంతుగా ప్రత్యేకంగా నిధులు కేటాయించిదని దీనిలో భాగంగా సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ముల్కల్ల సత్యనారయణ, గాలి మధు, ఒడిల రాజన్న, కుర్రు వెంకటేశం, రామ చందర్, దందేరా మహేష్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





