Sunday, March 29, 2026

రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

104 ప్యాకేజ్ కెనాల్ కింద సాగునీరు విడుదల చేయాలని అడిషనల్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన రైతులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :
కేటి దొడ్డి మండలంలో ఉన్న కొండాపురం గంగనపల్లి ఈర్ల బండ వెంకటాపురం పాగుంట గువ్వలదిన్నె ఇరికిచ్చాడు వరకు యాసంగి పంట సాగు కొరకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీరు అందించాలని బుధవారం అల్వలపాడు సబ్ స్టేషన్ దగ్గర రైతుల ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన రైతులు తమ గోడును. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీరు అందే విధంగా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ను కోరారు పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయి ఈ దృష్టి ముఖ్యమంత్రికి చేరవేయాలని రైతుల కోరారు అదే విదంగా ఇరిగేషన్ మంత్రి ఒక్కసారి నడిగడ్డ ప్రాంతానికి వచ్చి పంట పొలాలను పరిశీలించాలని సూచించారు ఈ యాసంగి పంటకు నీరు వదలకపోతే రైతుల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొన్నది కావున ఇట్టి విషయంపై ఉన్నతాధి అధికారులు స్పందించి రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీరు విడుదల చేసి పచ్చని పైరులకు నీరు అందే విధంగా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందరెడ్డి రాజేష్ అంబ్రెష్ భీంరెడ్డి పద్మారెడ్డి k ఈరన్న m గోపి తదితరులు పాల్గొన్నారు.,.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News