Wednesday, March 25, 2026

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

సీఎం రేవంత్ రెడ్డికి టీయూఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డులు

నేటి సాక్షి చేర్యాల : తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అందే అశోక్, అంబటి అంజయ్య, బండోజు భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. టీయూఎఫ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కి చేర్యాల పోస్ట్ ఆఫీసు నుంచి పోస్టుకార్డులు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు కేసులు పాలై జైలు జీవితాలు గడిపి ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, ఉద్యమకారుల పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 25 వేల రూపాయల పింఛన్, 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమ కారులకు గుర్తింపు కార్డు, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో ఉద్యమకారులు ఎండీ. జహురద్దీన్, తౌట రమేష్, గజ్జల సురేందర్, మ్యాక యాదయ్య, అంజయ్య, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News