- నిస్సహాయులకు చేయూతను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : మంగళవారం వేములవాడ పట్టణంలోని 22 వార్డు లో ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఏర్పడిన నాటి నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం జరిగిందని, 200 వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజా పాలనలో మీరూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ, వార్డు సభల్లో నూతంగా కూడా దరఖాస్తు చేసుకోవాలని, లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 26వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో లాగా నాలుగు గోడల మధ్య ఉండే ఎంపిక ప్రక్రియ కాదు ప్రజల మధ్య చర్చించి నిజమైన అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వేములవాడ పట్టణంలోని మురుగునీరు గుడి చెరువు, మూల వాగులో కలవకుండా 9 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 26 నుండీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డుల్లో పెరు లేని వారు ఈ నెల 21 నుండీ 24 వరకు గ్రామ సభలో తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మన ప్రాంతంలో అదనంగా మరో 4696 ఇళ్లను మంజూరి చేయడం జరిగిందని పేర్కొన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందన్నారు. జనవరి 16 నుంచి జనవరి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జనవరి 21 నుంచి జనవరి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాలను జనవరి 26 నుంచి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, కౌన్సిలర్ ఇప్ప పుల అజయ్, ఎమ్మార్వో మహేష్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.





