Saturday, March 14, 2026

అర్హులందరికి సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

  • అర్హులైన లబ్ధిదారులందరికి అందజేత
  • కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
స్థానిక హుజురాబాద్ పట్టణంలోని 30 వార్డ్ విద్యానగర్ లో మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ముందు బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య హాజరైనారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గందె రాధిక మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలైన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అర్హులకు అందజేస్తారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య మాట్లాడుతూ…. ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రానివారు నిరాశ పడకుండా, మళ్లీ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నచో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేసి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వార్డు కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు రానివారు అసంతృప్తి చెందవలసిన పనిలేదని, గ్రామసభ, ప్రజా పాలన నిరంతరం కొనసాగుతుందని, రానివారికి మళ్ళీ దరఖాస్తులు ఈ రోజున తీసుకున్నామని, దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి నూతన రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇంటి ఖాళీ స్థలం లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లకు 25, నూతన రేషన్ కార్డుల కోసం 35, రేషన్ కార్డుల్లో నూతన పేర్లు నమోదు చేయడానికి 19, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 02, మొత్తం దరఖాస్తులు 81 వచ్చాయి. వీటిని పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, 30 వ వార్డు ఆఫీసర్ రావుల రమేష్, 9వ వార్డు ఆఫీసర్ సరిత, 3వ వార్డు ఆఫీసర్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ రాజేష్, వార్డు జవాన్ ప్రతాపరాజు, రెవిన్యూ అధికారి, హుజురాబాద్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రేణికుంట్ల సందీప్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిట్యాల రేవంత్ ,30 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకుడు దిల్ శ్రీనివాస్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News