- ముఖ్యఅతిథిగలుగా హాజరైన చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, డాక్టర్ మురళీమోహన్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : పూతలపట్టు మండలం పరిధిలోని కొత్త వెంకటాపురం, పి. కొత్తకోట గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాల వినాయక, శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ హాజరయ్యారు. ముందుగా ఆలయాలకు చేరుకున్న ఎమ్మెల్యేలకు ఆలయ ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బాల వినాయక, శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక హోమం పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే లకు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని భక్తిశ్రద్ధలతో స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.





