Wednesday, March 25, 2026

వైభవంగా శ్రీ మల్లికార్జునుడి విగ్రహ ప్రతిష్టాపన

  • పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి
  • అన్న ప్రసాదం అందించిన జీరెడ్డి దంపతులు

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం యాదవ కుల సంఘం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు విప్ ను సత్కారించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకుల వేదమంత్రాల నడుమ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేపట్టారు. ఈ సందర్బంగా భక్తులకు కొత్తపేట గ్రామ వాసి, సామాజిక సేవకులు జీరెడ్డి అనూష-మహేందర్ రెడ్డి దంపతులు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి భక్తులు, ప్రజలు ఆధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News