- పాల్గొన్న మాజీ మంత్రులు కొప్పుల, గంగుల
నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం యాదవ కుల సంఘం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా సోమవారం పెద్ద పట్నాలకు తాజా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఓగ్గు డోలు కళాకారులతో స్వాగతం తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కారించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకుల వేదమంత్రాల నడుమ సాగిన శ్రీ మల్లికార్జున స్వామి, శివ పంచాయతన, నవగ్రహ, శ్రీ కూర్మ ద్వజ, శిఖరయంత్ర శిల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పూర్తయింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు గంగుల ఆశోక్-పద్మ, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మండల అధ్యక్షులు సింహాచలం జగన్, చల్లూరి రాంచంద్రం, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, తాజా మాజీ సర్పంచ్ లు గంగుల నగేష్, మారం జలేందర్ రెడ్డి, మెతుకు స్వామి, రామిల్లా సనీల్-లావణ్య, మాజీ యంపిటిసీ సభ్యులు గాజుల మల్లేశం, ముగాల సత్యం, నాయకులు మారం జగన్ మోహన్ రెడ్డి, మైలారం సతీష్, ఉద్యమకారుడు పడిదం వెంకటేష్, అరెల్లి బాబారాజ్, చింతల తిరుపతి, గాధం భాస్కర్, ఉప్పు రాజన్న, బాలసాని సత్యం, షేక్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.




