Sunday, March 29, 2026

పసి బాలుడి వేదనకు స్పందించిన పోలీసు హృదయం

  • సవతి తల్లి వేధింపులతో పోలీసులను ఆశ్రయించిన బాలుడు
  • వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : పసి బాలుడి వేదనను పోలీసు హృదయం ప్రేమతో ఆదరించి అక్కున చేర్చుకున్న ఘటన వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.సవతి తల్లి పెట్టే బాధలను మనసు నుండి బయటికి రానీయకుండా భరిస్తున్న ఒక బాలుడిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ చేరదీసి అతని భద్రతకు భరోసా కల్పించారు. వివరాలలోకి వెళితే,పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహ వనితల కుమారుడు (9).వనిత అనారోగ్యంతో రెండేళ్ల కిందట మరణించగా పెద్దల బలవంతంపై నరసింహకు సమీప బంధువైన లక్ష్మిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు.పెళ్ళైన కొత్తలో లక్ష్మి బాలున్ని బాగానే చూసుకునేది. కాలం గడిచేకొద్దీ కక్ష సాదింపుకు పాల్పడడం ప్రారంభించింది. చీటికీ మాటికి ఎవరూ లేని సమయం లో శారీరకంగా చిత్ర హింసలకు గుర్తుచేస్తూ నరకం చూపడం మొదలు పెట్టింది. ఏదో ఒక సాకుతో చిన్న విషయానికి చాటు మాటుగా తిట్టడం కొట్టడం అతని సవతి తల్లి శారీరకంగా హింస పెడుతూ అతనికి నిప్పులో కాల్చిన సలాకితో అతని తొడలు కాల్చినది ఆ విషయం ఆ బాలుడు తండ్రికి చెప్పినా ఆమె అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు.మంగళవారం రోజు బాలుడిని అకారణంగా ఆమె చితకబాధగా ఆ విషయాన్ని ఆ అబ్బాయి తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. రామచంద్రయ్య బాలుని తీసుకొని జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫిస్ కు చేరుకున్నాడు.ఆ అబ్బాయికి సంబంధించిన వృత్తాంతమంతా రామచంద్రయ్య ఎస్పీ కి వివరించాడు. దెబ్బలను గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తున్న బాలున్ని ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ గారు చేరదీసి అల్పాహారాన్ని అందజేసి ఊరడించారు. అనంతరం ఎస్పీ తనతో పాటు నివాసగృహానికి తీసుకెళ్లి భోజనం చేయించి కొద్దిసేపైనా తర్వాత అతని ద్వారా జరిగిన సమాచారమంతా రాబట్టారు. సవతి తల్లి పెడుతున్న బాధలను ,ఆ పసి హృదయం భరించిన తీరును విన్న ఎస్పీ చలించి పోయారు. వెంటనే ఆ అబ్బాయిని జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధికారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ల ద్వారా బాలుడు ఎదుర్కొన్న మనోవేదనను, చిత్రహింసల వివరాలను సేకరించాలని వారిని కోరారు. వారి నివేదిక ఆధారంగా నిందితురాలిపై పెబ్బేరు పోలీస్టేషన్లో కేసు నమోదు చట్టపరంగా చర్యలు చర్యలు తీసుకున్నారు. బాలుడు భయం విదేవిధంగా చైతన్యం తీసుకువచ్చి జిల్లాలోని ఏదేని పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News