నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): మాజీ చీఫ్ విప్, బీఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… తెలంగాణా ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. గ్రామ/వార్డ్ సభల పేరిట, దరఖాస్తుల పేరిట, సర్వే ల పేరిట కాలయాపన చేస్తోంది గతంలో మన జిల్లాలో పని చేసిన ఉన్నత అధికారిణి, పమేలా సత్పతి ఐ ఎ ఎస్, ఒక మహిళా అధికారి అని చూడకుండా దూషించడాన్ని మేము ఖండిస్తున్నాము. గాలిలో గెలిచిన మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హామీలు నెరవేర్చమని అడిగితే కట్టేసి కొడుతాం అని బెదిరింపులకు దిగుతున్నారు. 4,5 నెలల్లో జరబోయే స్థానిక ఎన్నికల్లో ఎవర్ని ఎవరు కోడతారో చూద్దాం ఇచ్చిన హామీలు అడిగితే కొడతామాని అనడం ఎంత వరకు సమంజసం? రైతు బంధు రైతు భీమా అడుగుతే కొడతారా? ఇందిరమ్మ ఇల్లివ్వమని అడుగుతే కొడతారా? మా మహిళలు 2,500 అడుగుతే కొడతారా 4000, 6000 పెన్షన్ అడిగితే కొడతారా అని ప్రశ్నించారు?
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…
మన జిల్లా మంత్రి అయిన కొండా సురేఖ గ్రామ సభలకు హాజరు కాదు. గుమాస్తలను పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్నారు. మా వరంగల్ లో 2, 3 షాపింగ్ మాల్స్ ని కూలగొట్టి ఆరంభ శూరత్వం ప్రదర్శించి సెటిల్ మెంట్ అనంతరం మళ్ళి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లకు పరదాలు అడ్డు కట్టి నడిపిస్తున్నారు. వార్డు సభల్లో పాల్గొన్నది లేదు. అభివృద్ధి ఆగి పోయింది, మేము తీసుకొచ్చిన నిధులకే కొబ్బరి కాయలు కొడుతూ వారి పేరు చెప్పుకుంటున్నారనీ అన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ…
ఖాజా పాషా అనే మహబూబ్ నగర్ రైతు ఆత్మహత్యతో కాంగ్రెస్ పాలనలో 409 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిన హత్యలు 15000 ల రైతు భరోసాను 12000 లకి తీసుకొచ్చి సంవత్సరం రైతు భరోసాను ఎగవేస్తున్నారు. మా ఘన్పూర్ లో కడియం శ్రీహరి గ్రామ సభల్లో పాల్గొనకుండా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రతి రైతుకు ఎకరానికి కాంగ్రెస్ ప్రభుత్వం 17500 ఇప్పటికే బాకీ పడింది రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలల్లో కోత పెడుతున్నారు. కౌలు రైతుల సంగతే మర్చిపోయారు బోనస్ బోగస్ అయింది రుణమాఫీ 30 40 శాతానికి మించలేదు. కోతలు, బోగస్ మాటలతోనే ప్రభుత్వం నడుస్తోంది.
మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…
గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభలు పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి
ఈ రాష్ట్రంలో ఒక్క లబ్దిదారుణ్ణి ఈ రోజుకూ సెలెక్ట్ చేయలేదు. మంత్రులు మరియు ఎమ్మెల్యే లు ఎన్ని గ్రామ సభల్లో పాల్గొన్నారో జిల్లా కలెక్టర్లు ప్రకటించాలి. నర్సంపేట లో పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ కౌన్సిలర్ ని కొడితే గంటల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తే పోలీస్ వారు న్యాయం చేయలేదు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. పోలీసు పాలన నడుస్తోంది. వరంగల్ సీపీ అంటే గౌరవం వున్నది. ఎమ్మెల్యే లకి ఏకే 47 లని ఇస్తూ 2+2 గన్ మెన్స్ ని ఎలా ఇస్తారు ? సీపీ వరంగల్ ఈ అంశం మీద దృష్టి పెట్టాలి తుపాకులతో తిరుగుతూ కొందరు ప్రజలను ఆందోళనకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…
స్థానిక ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే గ్రామసభలు జరిగాయి. ఈ ప్రభుత్వం ఏ ఒక్క మాట మీద నిలబడలేదు. దావోస్ మరియు సింగపూర్ పోయి ఇప్పుడు లక్ష కోట్లు, పోయిన సారి 40 వేల కోట్లు తెచ్చామన్నారు. అవి ఎక్కడికి పోయాయి సిగ్గులేని రేవంత్ రెడ్డి మీ ఇంటి పక్కనే కదా మేఘా కృష్ణా రెడ్డి ఉండేది. పోలీస్ వాళ్ళని కార్యకర్తలు లా వాడుకుంటున్నారు. వాళ్ళతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. అధికారులు గుర్తు పెట్టుకోవాలి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.





