Tuesday, March 17, 2026

మాదక ద్రవ్యాల ప్రభావం యువత భవిష్యత్తుకు అవరోధం

జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి ఎక్సైజ్ ఎస్ఐ మనీషా రాథోడ్, నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ అధికారి మాట్లాడుతూ, బాలబాలికలు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. యువత తాము ఉన్న పరిసరాలలో ఇతరలు ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లయితే వెంటనే డ్రగ్స్ హెల్ప్ లైన్ నం.14446 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, సామాజిక బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించి, యాంటీ డ్రగ్స్ సంబంధిత వీడియోలను స్క్రీన్ పై ప్రదర్శించి యాంటీ డ్రగ్స్ అంశంపై రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ఫర్జానా, జిల్లా హెడ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సమన్వయకర్త సౌజన్య, జెండర్ స్పెషలిస్ట్ విజయ, చైల్డ్ లైన్ సమన్వయకర్త ప్రేమ్ కుమార్, సురేష్, సఖి కేంద్రం, పారామెడికల్ రమ, కళాశాల యంత్రాంగం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News