- నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తా..
- యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి..
- చందుర్తిలో మహనీయుల విగ్రహ ఆవిష్కరణ..
- ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆది..
- విగ్రహ దాతలను అభినందించిన ప్రభుత్వ విప్…
నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి :
మహనీయుల స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.
శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే, సావిత్రిబాపులే, గౌతమ బుద్ధ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.

ముందుగా గ్రామంలోకి చేరుకోగానే డప్పు చప్పుళ్ళతో, కోలాటాలతో భారీ ర్యాలీగా బయలుదేరి డా,బి ఆర్ అంబేద్కర్, అమరవీరుల స్థూపనికి, చాకలి ఐలమ్మ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… చందుర్తి మండల కేంద్రంలో ఒక పండగ వాతావరణం లో మండల పరిధిలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని ఆ మహనీయులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రి బాపులే వంటి మహనీయులు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, ఆ మహనీయుల విగ్రహాలను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వకారణం అని అన్నారు.
1827 లో పుట్టిన జ్యోతి రావు పులే ఆనాడే సమాజంలో జరుగుతున్న కుల వివక్షత పై రాజీలేని పోరాటం చేశారని, చదువుకున్న ప్రాముఖ్యతను గుర్తించి అనాడు అన్నగారిన వర్గాల ప్రజలు చదువుకోడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రి బాపులే కు చదువు చెప్పి మహిళలకు కూడా చదువు అవసరమే అని అందుకే మహిళలందరూ చదువుకోవాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
లౌకిక దేశంలో కుల మతాలకతీతంగా ముందుకు పోతున్నామని, గౌతమ్ బుద్ధుడు రాజుగా ఉండి అవన్నీ వదిలేసి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆ మహనీయుల చరిత్రను భావితరాల వారికి తెలియజేయాలని, ఆ మహనీయుల విగ్రహాలను చూస్తూ మందు తరాల వారు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీకృష్ణదేవరాయల పుట్టినరోజు సందర్భంగా విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం అని తెలిపారు. విగ్రహ దాతలైన మోతే రాములు, మోతే బాబు లను ప్రభుత్వ విప్ అభినందించారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి చేపట్టామని అందుకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నo ప్రభాకర్ కులగనన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన పూర్తి చేశామని, గత ప్రభుత్వం ఆధార బాధరాగా సర్వే చేసి రిపోర్టు బయోట పెట్టలేదాని, గత ప్రభుత్వం గతంలో ఉన్న 34% బీసీ రిజర్వేషన్లను 23% తీసుకువచ్చారని, బీసీలపై ముసలి కన్నీరు కారుస్తున్నరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేరని మండిపడ్డారు. బిసి బిడ్డగా మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ చేశారని, ఆనాడు ప్రతిపక్షంలో పోరాటం చేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ మనుమతులు తెలియకపోయాయని, గెలిచిన సంవత్సరంలోపే అనుమతులు తీసుకువచ్చానని,త్వరలోనే మొదటి దశ పనులు ప్రారంభం జరుగుతాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని, అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నాడు మల్యాల గ్రామానికి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని తీసుకువచ్చి 1737 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసుకున్నామని గుర్తు చేశారు.
మధ్యతరగతి భావాజాలాలు ఉన్నవాడు చేతిలో పదవి ఉంటే మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మన ప్రాంతన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, ఏఎంసీ చైర్మన్ చేలకల తిరుపతి, ఏఎంసి వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ ఎంపిటిసి పులి రేణుక సత్యం, కాంగ్రెస్ నాయకులు గోట్టే ప్రభాకర్, మాజీ ఎంపిటిసి మేకల గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.





