Thursday, April 3, 2025

కలగానే మిగిలి పోతున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
25 సంవత్సరాలుగా ఎదురు చూపులు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… నేషనల్ హెల్త్ మిషన్ లో 2000 సంవత్సరం నాటి నుండి కేంద్ర ప్రభుత్వము 60 కేంద్రము శాతం రాష్ట్ర ప్రభుత్వం 40శాతం రాష్ట్రాలు కలిపి 100% నిధులతో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను నడిపిస్తున్న ప్రభుత్వాలు ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తులను దేశ వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ద్వారా వివిధ భాగాలలో ఉద్యోగులను నియమించింది నాటి నుండి నేటి వరకు అరకొర వేతనాల తోనే కుటుంబాలను నడిపించుకుని నడిపించుకోలేక నేటి వరకు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు కానీ మనకు స్వాంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రభుత్వ పరిపాలన కొనసాగించినప్పటికీ ఆనాటి నుండి నేటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం అధికార రాజ్యం ఏలినప్పటికీ కనీస వేతనాల చట్టం ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాలు నేటి వరకు అమలు చేయలేక పోయినాయి జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ అని ముద్దు పేరు పెట్టిన ప్రభుత్వాలు వారి తోటి చాలా సంవత్సరాలు వెట్టి చాకిరి చేపించుకున్నారే తప్ప వారిని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా నేటి వరకు గుర్తించలేని పరిస్థితి అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాజకీయ ప్రభుత్వం కానీ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను క్రమ బద్ధీకరణ కాకపోగా మొన్న అధికారంలో ఉండి పోయిన బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మాటే ఉండదు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు అని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల కాల పరిధిలో అనేక మార్పులు ఇంటికొక ఉద్యోగం అని మూడు ఎకరాల భూమి అని, అలాగనే ప్రతి ఒక్కరిని ధనవంతులు గానే చూస్తానని, నిరుపేదలు గా ఎవరు ఉండరనీ అని, చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకు పోయి అధికారం కోల్పోయిన సంగతికి అందరికీ తెలిసిందే ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ యావత్ భారత దేశంలో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక 44 చట్టాలను కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లుగా విభజించి ఆదానీ, అంబానీ నల్ల కుబేరుల కంపెనీ యజమానులకు వత్తాసు పలికే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు నరేంద్ర మోడీ బహిరంగ సభలలో అచ్చయ్య దీని ఆయేగా అని ప్రగల్ బలికిన నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ సమస్య దేశంలో ఉండదని కార్మికులు యధా యచ్చగా పని చేసుకోవచ్చని సంతోషంగా బ్రతకగలరని చెప్పినా మోడీ ఇప్పుడు కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లను కంపెనీ యజమానులకు ఆదాని అంబానీలకు నల్ల కుబేరులకు నరేంద్ర మోడీ వత్తాసు పలకడం మాను కోవాలని తిరిగి యధావిధిగా 44 చట్టాలను పునరుద్దించాలని అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరనీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను ఇతర రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజేషన్ చేసిన రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల మణిపూర్, పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News