- ఆలయ అభివృద్ధి గురించి చర్చించిన ప్రభుత్వ విప్
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
రాజన్న ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ తో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం చర్చించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్ ఐఏఎస్ స్వామి దర్శనము నకు వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి,ఇటీవల వీటీడీఏ సమావేశంలొని పలు అంశాలపై చర్చించారు. రాబోవు మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్, పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, కూరగాయల శ్రీనివాస్, తదితరులు పాల్గోన్నారు.

