Monday, December 23, 2024

ఇనుప రాడ్డుతో కాలు వీరిగకొట్టిన వ్యక్తిని అరెస్టు చెయ్యాలి

  • ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎస్సి, ఎస్టీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మాచర్ల ప్రకాష్,
  • ఆర్.ఎస్.పి టీం జిల్లా అధ్యక్షుడు బండారి సునంద్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా: అయిజ దళిత సామజిక వర్గానికి చెందిన మాదిగ రాజేష్ ను ఆకారణంగా కుల దూషణ చేసి విచక్షణ రహితంగా ఇనుప రాడ్డు తో దాడి చేసి కాలు విరగ గొట్టిన పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన దూర్మార్గుడు బోయ వెంకటేశ్వర్ ను వెంటనే అరెస్ట్ చేయాలనీ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎస్సి, ఎస్టీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాచర్ల ప్రకాష్ డిమాండ్ చేశారు తీవ్రంగా గాయపరిచి వారం రోజులు అవుతున్నా బోయ వెంకటేశ్వర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు అయిజ మున్సిపల్ కు చెందిన ఎస్సి మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజేష్ ఈ నెల 12 వ తారీఖున తన భార్య స్వగ్రామమైన చిన్న పోతులపాడు గ్రామానికీ వెళ్ళాడు
ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి రాజేష్ మూత్ర విసర్జనకు వెళ్లగా తన ద్విచక్ర వాహనం అడ్డముగా ఉన్నదని నెపంతో పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు అనే దూర్మార్గుడు కులం పేరుతో రాజేష్ ను దూషించడంతో పాటు తన కారులో నుండి ఇనుప రాడుతో దాడి చేయడం వల్ల రాజేష్ కుడి కాలుకు తీవ్ర గాయాలై కాలు విరగడం జరిగిందని బాధితుడు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడని అన్నారు. వెంటనే బోయ వెంకటేశ్వర్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అన్నారు. అదే విదంగా ఇటిక్యాల మండల ఎస్సి మాదిగ తహసిల్దార్ నరేందర్ మీద దాడి చేసిన మునగాల గ్రామ రెడ్డి కులానికి చెందిన నేరస్థులను అరెస్ట్ చేయడం లేదని జోగులాంబ గద్వాల జిల్లాలో దళితుల మీద దాడులు తీవ్రస్థాయిలో జరుగుతున్న కూడా నేరస్తుల మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కేసులు నమోదు చేయడంలో జాప్యం, నేరస్తులను కట్టిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నందుకే దళితుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న దళితులు ఐక్యమత్యంతో కలిసి ఉంటేనే దాడుల నుండి కుల వివక్ష నుండి విముక్తి అవుతామని, సామాజిక అభివృద్ధి అవుతమని మాచర్ల ప్రకాష్ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News