- మెనూ పగడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

మెదక్ జిల్లా, మెదక్, నేటి సాక్షి (భూమయ్య) : ఆదివారం మెదక్ మండలంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నతెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కలెక్టర్ వంట కొరకు వినియోగిస్తున్న కూరగాయలను, పప్పు దినుసులను పరిశీలించిన అనంతరం, విద్యార్ధినీలతో మాట్లాడారు. భోజనం రుచికరంగా ఉంటున్నదా, మెనూ ప్రకారం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు వసతి గృహాల్లో మెనూ సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. అన్నారు.విద్యార్థుల పట్ల తమ స్వంత పిల్లల్లా శ్రద్ధ వహిస్తూ, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన, సరైన వసతి సదుపాయాలను కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థినీ విద్యార్థుల సామర్ధ్యాలు ప్రశ్నలతో సమాధానాలు రాబట్టగా విద్యా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం, నిద్ర అవసరమని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. తద్వారా విద్యపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సంబంధించి సిబ్బంది పాల్గొన్నారు.





