- భద్రత కట్టు దిట్టంపై పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిది వనపర్తి జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి జిల్లాలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా శుక్రవారం వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ భద్రతా చర్యల్లో భాగంగా సభా స్థలాన్ని , వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ నిబంధనలు పాటించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ తో పాటు వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ కొత్తకోట ఎస్సై, ఆనంద్, ఉన్నారు.





