Tuesday, March 31, 2026

అధిక లాభాలనిచ్చేది మలబరి పంటనే

  • పట్టు సాగుతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులు
  • జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు మహమ్మద్ రషీద్

నేటి సాక్షి-హుజురాబాద్: (రాఘవుల శ్రీనివాసు) : మల్బరి పంట సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలను ఇస్తున్నదని, పట్టు పురుగుల పెంపకంతో రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు మహమ్మద్ రషీద్ తెలిపారు సోమవారం హుజరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో పట్టు సాగు చేస్తున్న కేంద్రాలను, నయా చాకీ రేరింగ్ సెంటర్ తిమ్మాపూర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే అగ్రికల్చర్ బిసి వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. పట్టు పురుగులు పెంపే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న దశ పురుగులను, మల్బరీ తోటలను, అడల్ట్ పురుగులను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రషీద్ మాట్లాడుతూ… ఈ పంట ఒక నెలలోనే చాకీ నుండి స్పిన్నింగ్ హార్వెస్టింగ్ వరకు అయిపోతుందన్నారు. విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా వివరించి చెప్పారు. పట్టుపురుగులకు కావలసిన మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, రోగ నిరోధక మందుల వాడకం, చాకీ దశ, చిన్న పిల్లల నుండి పట్టుపురుగులు స్పిన్నింగ్ మొదలై పట్టు గూడు కట్టుకునే దశ వరకు జరిగే పరిణామాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో శాస్త్రవేత్తలు విద్యార్థులు అడిగిన సందేహాలను సెరికల్చర్ అధికారి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి. నర్సింహా రెడ్డి, ఏంటమాలాజీ గీత, ఆగ్రోనామి శ్రీజ, ఐశ్వర్య, కావ్య, మొయిన్ – ప్లాంట్ బ్రీడింగ్, స్వప్న, ప్రవళిక విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News