నేటిసాక్షి నరసింహుల పేట భూక్యా రవి : మండలంలోని అజ్మీర గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతూ మరణించిన అజ్మీరా లచ్చిరం అనారోగ్యం తో మరణించడంతో చదువుల ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న వారి కుమార్తె అజ్మీరా నందిని బిఎస్సి అగ్రికల్చర్ మొదటి సంవత్సరం కి పాఠశాల ఉపాధ్యాయులు, అజ్మీరా తండ గ్రామపంచాయతీ పరిధిలోని ఉద్యోగులు, విద్యాభిమానులు 55500 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. విద్యాభిమనులు, దాతలు ఎవరైనా ఉంటే ఈ చదువుల తల్లి చదువు పూర్తి చేయుటకు సాయపడగలారని మనవి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అజ్మీర మోహన్ నరేష్ సునీత సేవ్య తదితరులు పాల్గొన్నారు.




