- ట్రాఫిక్ రూల్స్ ను చట్టాలు, నియమ నిబంధనలు పాటించాలి
- రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా తనిఖీలు
- ట్రాఫిక్ సమస్యపై రూరల్ ఎస్సై దృష్టి
- వనపర్తి సీఐ కృష్ణ
- వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి
- వనపర్తి ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర
- వనపర్తి టౌన్ ఎస్సై హరి ప్రసాద్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు వనపర్తి మండలంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు, గత రెండు రోజుల నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ ను చట్టాలు, నియమ నిబంధనల పట్ల వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర, ఏఎస్ఐ నిరంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా 25 రోజులు జరిగే ఈ కార్యక్రమం తో పాటు నిరంతర ప్రక్రియగా ట్రాఫిక్ విషయంలో వనపర్తి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌరస్తాలో మదర్స్ ల్యాబ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, స్కూల్ టీచర్స్ రోడ్డు భద్రత వారోత్సవాలలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ నిబంధనలో ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి వెళ్లాలని పిల్లలు వారి తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పాలని ఎస్సై పలు సూచనలు చేశారు. ఎస్సై ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఇటీవల సీజ్ చేయడం జరిగిందని, అంతేకాక హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న పిల్లలు కూడా తెలిసి తెలవక తల్లిదండ్రుల దగ్గర వాహనాలను తీసుకొని రోడ్లపైకి రావడం ప్రమాదాలకు గురిగవ్వడం వంటి అనేక విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని, ఎవర్ని ఇలాంటి భయ బ్రాంతులకు గురి చేయకుండా చట్టాలకు లోబడి పోలీసులు పని చేస్తున్నారని రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు.

పని తీరు ముఖ్యం ప్రజాసేవనే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఇందుకోసం ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు డిఎస్పి వెంకటేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. కృష్ణ, ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం తో పాటు ట్రాఫిక్ విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పనిచేస్తారని ఈ విషయము వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు, స్కూల్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

