
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కాయిత రాములు, ప్రధాన కార్యదర్శిగా కామని రవీందర్, కార్యవర్గ సభ్యులు పోతరాజు సంపత్ ఎన్నిక పట్ల తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ పద్మశాలి సంఘం తరఫున హుజురాబాద్ మండల పరిషత్ ఆడిటోరియంలో జరిగిన సన్మాన సభలో ఘనంగా శాలువాలతో సత్కరించి సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు చందుపట్ల జనార్ధన్, బింగి కరుణాకర్, సబ్బని రాజేందర్, మార్త రవీందర్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, మంద బిక్షపతి, కూరపాటి రామచంద్రం పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికా రంగంలో దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందిస్తూ హుజురాబాద్ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతూ మునుముందు పేద ప్రజల పట్ల సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిల పని చేయాలని వారిని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.






