
నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : పదవ తరగతి చదివే విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా ఫలితాలు తేవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆరపేట శివారులో గల సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు.పదవ తరగతి పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. అలాగే సరైన భోజనం అందిస్తున్నారా హాస్టల్ లో పరిస్థితి బాగా ఉందా అని విద్యార్థులను అడిగి ఎటువంటి సమస్య వచ్చిన నాకు తెలుపాలని కోరారు. మీ పరీక్షా ఫలితాలకోసం తల్లిదండ్రులు వేచి చూస్తున్నారని, వారు గర్వపడేలా ఫలితం రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో గురుకుల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





