Sunday, March 15, 2026

పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనది

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొంది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి హాజరయ్యారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమీషనర్ రాజీవ్ కుమార్ సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘం స్థాపించబడిందని, ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని అన్నారు. 18 నుండి 19 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఒక్క ఓటుతో గెలుపు, ఓటములు స్థానాలు మారుతాయని, అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియను విదేశాలు ఆదర్శంగా తీసుకోవడం గర్వంగా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వయస్సు అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని, అర్హత కలిగి ఓటు లేని వారు వారి వివరాలను జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. యువ ఓటర్లు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో అర్హత గల వారు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, యువ ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News