- ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
- బంగారు షాపుల యజమానులు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా గుజ్జుల స్వామి : వనపర్తి జిల్లా కేంద్రంలో నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు.వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ శంకర్ గంజ్ కాలనీలలో 14 వార్డు కౌన్సిలర్ బ్రహ్మం చారి, బులియన్ మర్చంట్ అధ్యక్షులు, అనిల్ కుమార్, సెక్రెటరీ, వేనాచారి, శంకర్ గంజి కాలనీవాసుల సహకారంతో 3 లక్షల 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ కాలనీ పెద్దలతో కలిసి గురువారం సాయంత్రం వనపర్తి టౌన్ శంకర్ గంజి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్నిపట్టణాలలో, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు షాపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను అమర్చుకోవాలని ప్రజలను ఎస్పీ కోరారు. కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం కాలనీలలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన తెలుస్తుందని, కాలనీలలో ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.కాలనీలలో ఉన్న సిసి కెమెరాలు జిపిఎస్ కనెక్ట్ చేయడం వల్ల జిల్లా కమాండ్ కంట్రోల్ నుండి మరి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవదానికి అవకాశం ఉంటుందని తెలిపారు.వనపర్తి టౌన్ లోని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చిన నాయకులను, పెద్దలను ఎస్పీ ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించి, ఘనంగా సన్మానించడం జరిగింది వీరిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పి ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, క్రిష్ణ,వనపర్తి టౌన్ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి 14వ వార్డ్ కౌన్సిలర్ బ్రహ్మం చారి, బులియన్ మర్చంట్ అధ్యక్షుడు, శ్రీనివాసులు సెక్రెటరీ,వేణచారి, కాలనీ నాయకులు, పెద్దలు ప్రజలు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





