రామాలయం ఈ ఓ రమాదేవి
నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు విజయవంతం అయ్యేందుకు జర్నలిస్ట్లు విస్తృత ప్రచారం కల్పించి కీలక పాత్ర వహించారని, అధ్యయనోత్సవాలలో ప్రధాన మైన తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారని రామాలయం ఈ ఓ రమాదేవి పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో భద్రాచలం జర్నలిస్ట్ లకు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.అనంతరం జర్నలిస్ట్ లను ఈ ఓ రమాదేవిని శాలువతో సత్కరించారు.





