Wednesday, March 25, 2026

నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి
కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్స్ ప్లోజివ్ ల గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజీ తెలిపారు. శనివారం కమిషనరేట్ కు కేటాయించబడిన డాగ్స్, డాగ్స్ హాండ్లర్స్ లు రామగుండం కమిషనరేట్ లో సిపి ఎం శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకొని, మూడు జాగిలాలు కమిషనరేట్ కు రావడం జరిగిందన్నారు. ఈ మూడు జాగిలాలు నార్కౌటిక్ డాగ్ (జెస్సి) గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో, స్నిపర్ డాగ్ (రైడర్) ఎక్స్ ప్లోజివ్ గుర్తింపులో, ట్రాకర్ డాగ్ (టైసన్) వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సంవత్సరకాలం శిక్షణ పొంది కమిషనరేట్ కు రావడం జరిగిందని వివరించారు. నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను, నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి, పట్టుకోవడంలో, ఎక్స్ ప్లోజివ్స్, బాంబ్ లను గుర్తించిన విధంగానే డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు ఈ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసిపి ప్రతాప్, ఆర్ఐ లు వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, సిసి హరిష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News