Monday, March 30, 2026

సమాజంలో మహిళల పాత్ర అమూల్యమైనది

  • విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు
  • మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి పట్టణంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పురాణ చారిత్రక కాలలలో మహిళలు తమ సంతానాన్ని రాజనీతిజ్ఞులుగా, మహాయోధులుగా తీర్చిదిద్దిన విధానాన్ని వివరించారు.నేడు తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేస్తూ చెడు అలవాట్లకు కారకులవుతున్న విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు.పిల్లల్ని మంచి సంస్కారవంతులుగా తయారుచేయాల్సిన బాధ్యత ప్రధానంగా తల్లులపైనే ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
అరవై మందికి పైగా మహిళలను ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తిరుపతయ్య, యాదగిరి, బ్రహ్మచారి, బైరోజు చంద్ర శేఖర్, సూర్యనారాయణ,గణేష్,నరసింహ, భాస్కర్, రవి, గిరిరాజాచారి, గోపి, మాజీ కౌన్సిలర్స్ అలివేలమ్మ, జ్యోతి, కల్పన, సుకన్య, సువర్ణదేవి, సుజాత, శారద తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News