- కేశంపేట మండలం మాజీ ఎంపీపీ వై రవీందర్ యాదవ్
- హ్యాపీ బర్త్ డే కానం ప్రేమ్ కుమార్ గౌడ్
- జన్మదినం సందర్భంగా ఆడియో విడుదల చేసిన రవీందర్ యాదవ్
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామ బిఆర్ఎస్ యువ నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకుడు, కేశంపేట మండల మాజీ ఎంపీపీ వై రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారి పేరు మీద ఆడియో సాంగ్ ను విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీలో యువ నాయకుల పాత్ర కీలకమని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కణం ప్రేమ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి అందించే సేవలు గొప్పవని అన్నారు. యువశక్తితో పార్టీ నిండి ఉందని, రాబోయే భవిష్యత్తు తరాలకు యువశక్తి సారధ్యము వహిస్తుంది. రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ రావు మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి అంజిరెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి జమాల్ ఖాన్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..





