Wednesday, March 25, 2026

సామాజికంగా వెనుకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కులగలను చేపట్టి 50 రోజుల్లో పూర్తి చేసింది

  • పార్లమెంట్ సభ్యులు మల్లు రవి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఈ కులాలలో ఎంతమందికి ఉపాధి ఉంది వారి ఆర్థిక స్థోమత ఏంటిది అనేది సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది.దేశంలో ఎక్కడా లేని విధంగా 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని కులాల మతాల విద్యార్థులు చదువుకుంటారు.దేశంలోనే ఇదొక విప్లవా త్మకమైన మార్పుగా అభివర్ణించారు. వనపర్తి జిల్లా వాసి శ్రీనివాస్ శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఉండటంతో ఆయన 6 కొత్త బ్రాంచ్లను నేడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అచ్చంపేటలో గిరిజనులను అడాప్ట్ చేసుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు.తన కృషి వల్ల యూనియన్ బ్యాంక్ ద్వారా జిల్లాలో ఐదు కొత్త బ్రాంచ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది అన్నారు.గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం కల్పించేందుకు యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు. డిజిటల్ లైబ్రరీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం లో వివిధ బ్యాంకుల ద్వారా రుణ మేళా ఏర్పాటు చేసి 1017 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా జాబ్ మేళా నిర్వహించి 295 మందికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని వారికి నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News