- ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ
నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన మాదిగ అమరవీరులకు మార్చి నెల ఒకటవ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఎమ్మార్పీఎస్ కమలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశారని,ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు,ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఎదురైనప్పటికి తన ఆశయాన్ని మాత్రం పక్కకు పెట్టకుండా,ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు,మాదిగ ఉపకులాలు అందరికీ న్యాయం జరుగుతుందని సంకల్పించి ముందడుగు వేశారని అన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాల అలుపెరుగని పోరాటాల తదుపరి 2024 ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ తీర్పును స్వాగతిస్తూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమ కెరటాలు మాదిగ అమరవీరులకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంకితం చేస్తున్నట్లు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు చిలువేరు సంపత్ మాదిగ, ఎంఎస్పి జిల్లా కార్యదర్శి శనిగరపు రవీందర్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా నాయకులు మద్దునూరి ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు ఇసంపెల్లి రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి ఇసంపెల్లి చంద్రమౌళి మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ప్రభాకర్ మాదిగ, పుల్ల శ్రీనివాస్ మాదిగ, అంకిల్ల రాజమల్లు మాదిగ,పెర్క శ్రీనివాస్ మాదిగ అంబటి భూమయ్య,మాట్ల శంకర్ మాదిగ తదితరులు పాల్గొని మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు.




