Thursday, March 12, 2026

అర్హుల గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలి

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
  • ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం అర్హుల గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ, ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడతూ… రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇప్పటికీ కార్డు లేని వారు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారని వివరించారు. ఈ అంశాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.

  • ఇందిరమ్మ ఇండ్లు.. అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారు ఉంటే అర్జీలు ఇవ్వాలని అధికారులు సర్వే చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని వివరించారు. ఇది కూడా నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పంపిణీలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
  • వ్యవసాయ యోగ్యం కానీ భూములు గుర్తించాలి..

జిల్లాలో వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించాలని ఆయా శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశించారు.
సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అందుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేసి గుర్తించాలని మిగతా శాఖ అధికారుల నుంచి సమాచారం తీసుకుని భూములను పక్కాగా గుర్తించాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంట సాగు వివరాలు, తహసీల్దార్లు వద్ద నాల భూముల కన్వర్షన్ వివరాలు పరిశీలన  చేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులందరికీ అందేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు.

  • కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం..

దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వివరాలను గ్రామసభలు నిర్వహించి గ్రామ సభలో చర్చిస్తామని, దరఖాస్తు చేసుకోని వారికి  కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ శేషాద్రి, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎస్ డీసీ రాధాభాయ్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, ఏడీ మైన్స్ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News