Saturday, March 14, 2026

ముగిసిన పాలకవర్గ కాలపరిమితి – వీడ్కోలు

హుజురాబాద్ పురపాలక సంఘం కమిషనర్ సల్వాది సమ్మయ్య

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజూరాబాద్ పురపాలక సంఘము నందు పట్టణ ప్రజలకు సేవలు అందించిన గౌరవ పాలకవర్గము వారి కాలపరిమితి తేదీ: 25-01-2025 శనివారము రోజున ముగుస్తున్నందున, పురపాలక సంఘ కార్యాలయములోని కౌన్సిల్ హాలు నందు గౌరవ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు కార్యక్రమమును ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇట్టి వీడ్కోలు కార్యక్రమములో పురపాలక చైర్ పర్సన్ గందె రాధిక అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు తమతమ వార్డులలో, ప్రజలతో మమేకమై వార్డులను అభివృద్ధి చేసిన విధానము గురించి ప్రసంగిస్తూ, వార్డుల అభివృద్ధికి సహకరించిన ప్రజలకు మరియు పురపాలక సంఘ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదలు తెలిపారు. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా హాజరైన హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ పాలకవర్గ సభ్యులను ఉద్ధేశించి, హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి తమవంతు సహాయసహకారాలు అందించిన పాలకవర్గ సభ్యులను అభినందిస్తూ ప్రసంగించడం జరిగినది. తదుపరి పాలకవర్గ సభ్యులను శాలువాలు మరియు జ్ఞాపికలతో సత్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కమిషనర్ సల్వాది సమ్మయ్య, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు గారు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వినీగాంధీ, జూనియర్ అకౌంట్స్ అధికారి జి. సంధ్యారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రషీద్, సీనియర్ సహాయకులు శ్రీకాంత్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, కార్యాలయ సిబ్బంది మరియు సానిటరీ జవాన్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News