Saturday, March 14, 2026

వలసల జోరు..! కాళీ అవుతున్న కారు..!!

  • కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కారు,కమలం నేతలు..
  • వేములవాడ రూరల మండలం నూకలమర్రి, హన్మజిపేట గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
  • కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ యస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, హన్మాజీపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు సుమారు 200 మంది బిజెపి , బిఆర్ఎస్ నాయకులు రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామ శాఖల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినా వారు మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని తెలిపారు.. గత కొన్ని సంవత్సరాలుగా బిజెపి బిఆర్ఎస్ పార్టీలలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని నేడు రాష్ట్రానికి తిరిగి వచ్చారని వారు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో సుమారు 49 వేల పై చిలుకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్రజలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మార్చి వారు సుదీర్ఘకాలం పనిచేసిన పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు.. కొత్త పాత అనే తేడా లేకుండా కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News