- దుబాయ్ లో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ
- వాస్తవాలే వార్తలుగా అందించడంలో ప్రత్యేక గుర్తింపు
- అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్

నేటి సాక్షి ప్రతినిధి, దుబాయ్ గల్ఫ్ ప్రతినిధి ( కోక్కుల వంశీ ) : ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న నేటి సాక్షి దినపత్రిక 2025 క్యాలెండర్ ను మంగళవారం దుబాయ్ లోని బార్ దుబాయ్ లోని అద్నాన్ కార్ వాష్ కార్యాలయంలో ప్రముఖ ఎన్నారై, సామాజిక సేవకులు, అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బోల్లి కుమార్ చేతుల మీదిగా ‘నేటి సాక్షి’ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొల్లి కుమార్ మాట్లాడుతూ… నేటి సాక్షి “దినపత్రిక” వేగంగా వార్తలు అందించడంతో పాటు వాస్తవాలే వార్తలుగా అందించడంలో సక్సెస్ అయ్యిందని అన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తక్కువ సమయంలో లక్షల మంది పాఠకుల ఆదరణ పొందింది అని అన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడిషన్ ల ద్వారా తాజా సమాచారాన్ని అందించడం లో “నేటి సాక్షి దినపత్రిక” సక్సెస్ అయిందన్నారు. ఈ సందర్భంగా నేటి సాక్షి పత్రిక యాజమాన్యాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి సాక్షి వేములవాడ ఆర్. సి ఇంచార్జి కోక్కుల వంశీ (మానాల), చందుర్తి మండల ప్రతినిధి పి. సతీష్, గల్ఫ్ సోదరులు పుట్టుకపు మధు, గట్ల శ్రీకాంత్, ఉరుమండ్ల రాజేందర్, మోత్కుపల్లి మహేందర్, ఆదరవేని గంగాధర్, మోతుపల్లి రవి, అదరవేణి గంగమల్లయ్య, బొల్లి శీను, ఎలకోసి మల్లేష్, మహేష్ తో పాటు గల్ఫ్ సోదరులు పాల్గొన్నారు.





