- మహిళలకు కాంగ్రెస్ లోనే ఉన్నత పార్టీ పదవులు
నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి.శ్రీకాంత్ : సోలార్ ప్లాంట్స్, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలెండర్, ఇళ్లు, రేషన్ కార్డులు అమ్మలకే: కెఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కందుల సమతా ప్రకాష్ ను కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అభినందించారు. తుక్కుగూడ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… హస్తం పార్టీ, సోనియాగాంధీ నాయకత్వంలో ఆడపడుచులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని కొనియాడారు. భవిష్యత్ లో మహిళలకు అధిక రిజర్వేషన్లు, పదవులు, ఉన్నత స్థానాల్లో అవకాశాలు వస్తాయని… వాటన్నింటినీ బాధ్యతతో అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు కిచ్చెన్న. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు మహేశ్వరం నియోజకవర్గంలో మహిళా నాయకత్వం బలోపేతం చేయాలని లక్ష్మారెడ్డి కోరారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్లల్లో అధిక సీట్లు కేటాయిస్తామని కేఎల్ఆర్ భరోసా ఇచ్చారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 సిలెండర్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, పదవులపై ఎక్కువ ప్రచారం చేయాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు. ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




