Monday, March 23, 2026

కేంద్ర బడ్జెట్ కష్టజీవులకు మొండి చేయి

  • పాలమాకుల జంగయ్య
  • సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్ పేదవాళ్లను కొట్టి బడా పారిశ్రామికవేత్తలకుపెడుతున్న నరేంద్ర మోడీసిపిఐ జిల్లా కార్యదర్శి, పాలమాకుల జంగయ్యకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసం తప్ప కార్మికులకు కష్టజీవులకు ఉపయోగపడే బడ్జెట్ కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య విమర్శ శనివారం నాడు తుక్కుగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపిందని వృత్తిదారులను దళిత గిరిజన శ్రామిక వర్గానికి మొండి చేయి చూపిందని గతంలో ఏనాడూ లేని విధంగా కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన మండిపడ్డారు. సిపిఐ 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న ఏనాడు అధికారంలో లేకపోయినా పదవులు రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన ఎర్రజెండా వదలకుండా వందేళ్లుగా కష్టపడుతున్న కమ్యూనిస్టు యోధులకు నాయకులకు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానం చేయాలని ఆయన కోరారు. దోపిడి వర్గాల కోటలను బద్దలు కొట్టే విధంగా కమ్యూనిస్టుల పోరాటాలు ఉండాలని కార్మిక రాజ్య స్థాపన కోసం ప్రతి కష్టజీవి ఎర్రజెండా చేతబట్టి పోరాటం నిర్వహించాలని ఆయన అన్నారు ఎర్రజెండా లేకపోతే దోపిడిదారులు దగా కోరులు కార్పొరేట్ సంస్థలు పేదలను మరింత పీడించి దోచుకునేవారని ఎర్రజెండా వచ్చిన తర్వాత దోపిడీ కొంత మేరకు అడ్డుకోగలిగామని అయినా వారి దోపిడీకి అంతే లేకుండా పోయిందని ఆయన అన్నారు. సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తుక్కుగూడలో జిల్లాస్థాయి సెమినార్ మార్చి 11న నిర్వహిస్తున్నామని ఈ సెమినార్ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రముఖ జర్నలిస్టు విశ్లేషకుడు పాశం యాదగిరి పాల్గొంటారని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు సిపిఐ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి బి. దత్తు నాయక్ బాలాపూర్ మండల కార్యదర్శి ఎం. చంద్రశేఖర్ రెడ్డి, కందుకూరు మండల కె. రాజు, మండల నాయకులు దేవేందర్ గౌడ్, డి. బ్రహ్మచారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News