Tuesday, March 17, 2026

న్యాయం చేయాల్సిన అధికారులే అన్యాయం చేశారు

  • పోలీసు, రెవెన్యూ బాధిత కుటుంబీకుల రిలే నిరాహార దీక్ష
  • మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ, దళిత సంఘం నాయకులు అంబాల రాజు

నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో న్యాయం చేసే అధికారులే అన్యాయం చేశారని కాటిపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులు రిలే దీక్షకు దిగారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే కాపాడలేని రెవెన్యూ, పోలీసు వారు ప్రైవేటు భూము లోపల లంచాలకు కక్కుర్తి పడి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాటిపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులు రిలే దీక్షలను ఉద్దేశించి హాజరై మీడియాతో మాట్లాడుతూ.. వారి సొంత స్థలమైన సర్వే నంబర్ 465/b/4 లో గురించి రిలే దీక్షలు ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వారికి జరిగిన అన్యాయం పట్ల గత ఐదు రోజుల క్రితము మీడియా ముఖంగా బహిర్గత పరుచుకున్న తర్వాత సంబంధిత భూ ఖబ్జాదారుడు అయినా పోలీసు మాజీ అధికారి ఏనుగు జయపాల్ రెడ్డి వీరికి సంబంధించిన భూమి లోపల మొరాన్ని తరలించి అక్రమ కట్టడం నిర్మించే ప్రయత్నము చేయడం జరిగిందని, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో సదరు కబ్జాదారుడికి స్థానికంగా ఉన్న చోటామోటా నాయకులు సహకరిస్తున్నారని పేర్లతోపాటు బహిర్గత పరచడం జరిగింది. ఇట్టి విషయమై సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ మాట్లాడుతూ హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మరీ ముఖ్యంగా జమ్మికుంట వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయిన విషయాన్ని ఉన్నత అధికారులను కలిసి ఫిర్యాదు చేసినను కూడా అధికారులను కలిసి ఫిర్యాదులు చేసిన, పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగము బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా పూర్తి ఆధారాలు రెవెన్యూ పరంగా పూర్తి అనుమతులు ఉన్న తర్వాత కూడా ఈరోజు ఇంత విచ్చలవిడిగా భూ ఖబ్జాదారులు రెచ్చిపోతున్నారంటే వీరిని కాపాడుతున్నటువంటి అధికారులు ఎవరూ దీనిపైన పూర్తిస్థాయిలో మరియు ప్రభుత్వ ప్రభుత్వం మరియు స్థానిక మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ దీక్షలకు హాజరైన దళిత నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కిందిస్థాయి పోలీస్ అధికారులను పై స్థాయి పోలీస్ అధికారులు ప్రోత్సహించబట్టే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఇదే విధంగా పూర్తిస్థాయిలోపల నిజ నిజాలను పరిశీలించాలంటే దీనిపైన ప్రభుత్వము వెనివెంటనే స్పందించి సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా దళిత నాయకులు అంబాల రాజు డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల బాధిత కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి ని పాదయాత్ర ద్వారా కలిసిఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News