- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలి
- సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు.
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువకులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరడం జరిగినదని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రనకా పగలనకా వాననక ఎండనక అహర్నిశలు శ్రమించి పని చేసిన వారికే అవకాశాలు కల్పించాలని కోరారు.