
నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శాంతినగర్ కు చెందిన షేక్ జునైద్, కుటుంబ సభ్యులు, బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండడంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి, బెడ్ రూమ్ లోని బీరువా తాళాలు పగలగొట్టి, బీరువాలోని, ఆరు తులాల బంగారు నగలు, 70 వేల రూపాయల నగదు, దొంగిలించుకుపోయరని, బాధితుడు, తన ఇంటిలో జరిగిన చోరీ గురించి, ఐదవ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో, సంఘటన స్థలానికి చేరుకుని, ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇట్టి చోరీ విషయాన్ని, ఫింగర్ ప్రింట్, డాగ్స్ స్క్వాడ్, వారికి సమాచారం చేరవేసినట్లు, ఐదవ టౌన్ పోలీసులు తెలిపారు.





