Sunday, March 22, 2026

భూమి విషయంలో వివరణ ఇచ్చేది లేదు

  • భూమి వివరణ విషయంలో ఎమ్మార్వో వింత ధోరణి
  • ప్రభుత్వ భూమి విషయంలో కార్యాలయంలో ఏం జరిగినట్లు..?
  • ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన ప్రభుత్వ భూమి
  • ఎమ్మార్వో తీరుతో జర్నలిస్టు సంఘాల ఆగ్రహం

నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్): వార్తల సేకరణ విషయంలో ఏ రిపోర్టర్ అయిన ఆ మండల అధికారి వివరణ కోరిన తదుపరి వార్తలు రాయడం సహజం. కానీ రామడుగు ఎమ్మార్వో వింత తీరుతో జర్నలిస్టులకు తలనొప్పిగా మారింది.రామడుగు మండలం గుండి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 21 లో బతుకమ్మ కుంట 37 గుంటల భూమి కాస్ర పహానిలో ప్రభుత్వ భూమిగా రికార్డు నమోదయింది. 2019 వరకు రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు అయి ఉంది. ఈ కుంటను బతుకమ్మకుంటగా గుండి గోపాల్ రావు పేట గ్రామస్తులు పిలిచేవారు.నాటి నుండి గత ఏడాది క్రితం వరకు ఈ ప్రభుత్వ భూమిలో బావి లాగా ఉన్న ప్రాంతంలో నీరు ఉండడంతో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. దీనిపై కన్నేసిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకొని అధికారులకు అమ్యమ్యాలు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఈ ప్రభుత్వ భూమిపై పలు దినపత్రికలలో వార్త కథనాలు వెలువడ్డాయి. దీంతో అప్పటి తాసిల్దార్ భాస్కర్ మండల సర్వేయర్ తో విచారణ జరిపి నివేదికను తెప్పించుకున్నారు. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాన కురిసిన వర్షపు నీరంతా పురాతన వంతెన ప్రస్తుతం నాలుగు కోట్లతో నిర్మించిన నూతన బ్రిడ్జి కి సమీపాన ఉండడంతో వర్షపు నీరంతా బతుకమ్మ కుంట నుండి జాలు వారేది. ఇందుకు సాక్ష్యం ఇదే స్థలంలో ప్రధాన రహదారిపై బ్రిడ్జిలు నిర్మించారు.ఈ భూమి ఎప్పుడు గుంటకు లక్షల్లో పలుకుతుండడంతో కబ్జా జరిగిన భూమిపై వార్త సేకరణలో భాగంగా విషయంపై మండల తాసిల్దార్ వెంకటలక్ష్మిని పాత్రికేయులు గురువారం వివరణ కోసం కార్యాలయానికి వెళ్ళారు.అనంతరం ఎమ్మార్వో మండల సర్వేయర్ ను పిలిచి అడుగగా ఏడి ఆఫీసులో అసలు సేత్వార్ రికార్డు లేదని చెప్పారు.కాస్రా పహాని మాత్రం తాసిల్దార్ కార్యాలయంలో ఉందని చెప్పారు.కాస్ర పహాని వివరాలు ఇవ్వాలని తాసిల్దార్ ను అడగగా మీరు దరఖాస్తు ఇస్తేనే ఇస్తాం. లేదంటే ఇవ్వం అని మొండిగా మాట్లాడడంతో జర్నలిస్టు లకు చేదు అనుభవం ఎదురైంది. అంతే కాకుండా మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. అది మీ ఇష్టం. మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ఒక మండల ఎమ్మార్వో ఎలా సమాధానం ఇవ్వడంతో కబ్జాదారుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు వెళుతున్నాయని రేపటి తరానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూమిని కాపాడడంలో ఎమ్మార్వో విఫలమయ్యారు అంటూ మండల ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఇట్టి భూమిని కబ్జా దారుల చేతుల నుండి విడిపించి భావి తరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే ఎమ్మార్వో వింత ధోనణితో జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News