ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి…!!!
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవికి విరమణ ఉంటుందని వారు చేసే ప్రజాసేవకు మాత్రం విరమణ ఉండదని శేష జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేయవచ్చునని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.గోపాల్పేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహించిన రమాకాంత్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రధానోపాధ్యాయుడు రమాకాంత్ దంపతులను ఆయన శాలువాలతో సత్కరించారు ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు పదవి విరమణ పొందిన రమాకాంత్ శేష జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేయాలని ఆయన సేవలను తాము ఎల్లవేళలా సద్వినియోగం చేసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రముఖ వైద్యులు భూపేష్, మండల నాయకులు సత్య శీలా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





