- జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ కు వినతిపత్రం సమర్పించిన కొమ్ముల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని తీన్మార్ మల్లన్న జోగులాంబ గద్వాల జిల్లా టీం అధ్యక్షులు కొమ్ముల ప్రవీణ్ రాజ్.ఈ ఏ మేరకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ తో కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ మంగళవారం మహబూబ్నగర్లో ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ శ్యామ్మీ అత్తర్ చైర్మన్ కి వినతి పత్రం అందజేశారు. ఎస్సీలలో 70 శాతం ఉన్న మాదిగలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని, 30శాతం లోపు ఉన్న మాలలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఒక శాతం లోపు ఉన్న ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కల్పించాలన్నారు. తద్వారా రిజర్వేషన్ల్ ఫలాలు తగురీతిలో పొందలేకపోయిన కులాలకు, జనాభాప్రాతిపదికన వర్గీకరణ చేస్తే రాజ్యాంగ మూల సూత్రమైన సామాజికన్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా బీసీలలో జనాభా ప్రకారం వర్గీకరణ ఉన్నట్టుగా ఎస్సీలలో కూడా వర్గీకరణ ఉండాలి అని కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఎస్సీ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు డీకే సుందర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సామెల్ గారు, ఎమ్మార్పీఎస్ మల్దకల్ మండల అధ్యక్షులు తిమ్మన్న గారు తదితరులు పాల్గొన్నారు.

