- మీరు బాగా పని చెయ్యండి మీకు మంచి పేరు గుర్తింపు ఉంటుంది సబితా ఇంద్రారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారుల తో మహేశ్వరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి, మాట్లాడుతూ.. అధికారులు బాగా పనిచేస్తున్నప్పటికి వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచి నీటిసమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. హర్హత ఉన్న ఇంటిపై ఏ పార్టీ జండా ఎగురుతున్న సరే బెనిఫిషర్ కి లబ్ధి చెయ్యాలనే పని చేస్తానన్నారు. వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు ద్వారా గత 10 సంవత్సరాలలో ఒక్కొక్క రైతుకు ఎన్ని డబ్బులు అందినాయి, రైతు భరోసా ఇప్పటివరకు మండలంలో ఎన్ని ఎకరాలవరకు వేశాము వాటి వివరాలు వ్యవసాయ అధికారులను కోరగా పాత వివరాలకై కొంత గడువు కోరిన అధికారులు మండలంలో పెద్దమ్మ తాండ,తూప్రకుర్ద్ లలో మాత్రమే రైతు భరోసా అమలైందన్నారు. పాధి హామీ పతాకానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయితీలో పరిధిలో పని కల్పించడానికి అవకాశం ఉన్న భూములను గుర్తించడం,అవకాశం లేని గ్రామాల్లో ప్రయివేటు వెంచర్లలో చెయ్యడానికి,రోడ్లకు ఇరువైపుల గుంతలు పూడ్చే వాటికి వీలుంటే ప్రభుత్వానికి ప్రపోజల్ పంపమని చెప్పారు. రంజాన్ పండుగ సంబంధించి పండగలు హిందు,ముస్లిం, క్రిస్టియన్ ఏ పండగలైన సరే నీటి సమస్యలు రాకుండా చూడాలని ప్రజల సమస్యలు ఏవైనా సరే ఎంపీడీవో దృష్టికి తీసుకురావాలని విలేజ్ సెక్రెటరీలకు చూచించారు, విలేజ్ సెక్రెటరీలు అందరూ ఎంగ్ స్టార్స్ ఉన్నారు బాగా పని చెయ్యండి మీ బాధ్యత నేను తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




