Tuesday, March 17, 2026

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు వారంతా అనర్హులే..!

భారీగా దరఖాస్తులు రిజెక్ట్
మళ్లీ కొత్తగా అప్లయ్ చేసుకోవాలా?

నేటి సాక్షి, వీణవంక :
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ. 6వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. వీణవంక మండలంలోని శ్రీరాముల పేట గ్రామానికి 33 మంది వ్యవసాయ భూమిలేని కూలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున కూలీల అకౌంట్లో జమ చేయడం జరిగింది.

పథకానికి దరఖాస్తు వివరములు

ఈ పథకానికి 2,24,487 కొత్త దరఖాస్తులు వచ్చినాయి అని అధికారులు తెలిపారు. అందులో 19,193 భూమిలేని నిరుపేదల కూలీలగా గుర్తించారు. మిగితా 1,44,784 అనార్హులుగా వారి యొక్క దరఖాస్తును తిరస్కరించి అనార్హులుగా గుర్తించారు. మిగతా 49,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 5,80,577 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. 20 నుంచి 30 వేల మంది అర్హులుగా జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఆరు లక్షల పైగా లబ్ధిదారులు ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రత్యేక పోర్టల్ లో లబ్ధిదారి వివరాలు నమోదు ….

భూమి నుండి ఉపాధి పనికి వెళ్లే వారు కూడా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవడం వల్ల సంఖ్యలో దరఖాస్తులు రిజెక్టు అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పథకానికి ఇంట్లో ఏ వ్యక్తికైనా భూమి ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అనర్హులే. ఇందులో లబ్ధిదారుని ఆధార్ కార్డు నమోదు చేయగానే వారి మీద భూమి ఉందా లేదా అనే వివరాలు తెలిసిపోతున్నాయి. ఇది ప్రత్యేక పోర్టల్ లో ఎంటర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News