Thursday, March 26, 2026

బీసీ బిడ్డననే అణచి వేస్తున్నారు : బషీర్

నేటి సాక్షి, ఎండపల్లి: బీసీ బిడ్డననే కొందరు కావాలని తనను అణచి వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎండపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మహ్మద్ బషీర్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని తన నివాసంలో మద్దతుదారులతో కలిసి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. ఇటీవల కరీంనగర్ లోని ఓ భూమి విషయమై అగ్రవర్ణాల అండదండలతో పోలీసులచే ఏకపాక్షంగా తనపై అక్రమంగా కేసు బనాయించి రిమాండ్ కు తరలించారని ఇది అన్యాయమని, ఏదైతే తనపై ఆరోపణలు చేస్తున్న భూమికి సంబందించిన సరైనా పట్టా సంబందిత ఆధారాలు ఉన్నాయని ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి తనకు జరిగిన అన్యాయంను వివరిస్తానన్నారు. ఈ సమస్య నుండి తేరుకొనే క్రమంలో… రాజారాంపల్లి గ్రామంలో గతంలో తను కొనుగోలు చేసిన మరో భూమి విషయమై కొందరు రెడ్డిలంటూ పలువురి పేర్లను ప్రస్తావిస్తూ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉండగా వారు చదునుచేసి ఆక్రమించుకనే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి సంబంధించి కూడా కొనుగోలు పట్టా ఆధారాలు ఉన్నాయన్నారు. తనపై జరుగుతున్న వరుస చర్యలను కుట్రపూరితంగా అభివర్ణిస్తూ ఒక్క బీసీ బిడ్డనైన తనను కావాలనే ఆగ్రవర్ణాల వారు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తనపై జరుగుతున్న అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన నర్సయ్య, మంతెన లక్ష్మణ్, దొనకొండ శంకర్, దేవి రవీందర్, పాములపర్తి దయ సాగర్, సత్తయ్య, రాజేశం, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News