Saturday, March 14, 2026

హామీ ఇచ్చారు త్రాగు నీటి బోర్లు వేయించారు

  • ఎమ్మెల్యే నిధులనుండి రెండు బోర్లు మంజూరు
  • ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

నేటి సాక్షి, వేమనపల్లి : ముల్కలపేట గ్రామ పంచాయితీలో ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో మాజీ వైస్ ఎంపీపీ ఒడిల రాజన్న స్థానిక గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గురువారం రోజు ఎస్టి కాలనీ, బీసీ కాలనీ రెండు చోట్ల త్రాగు నీటి సమస్య ఉండటంతో బోర్లు మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఆర్.సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. గ్రామ ప్రజల అవసరార్థం ఎమ్మెల్యే నిధుల నుండి రెండు నీటి బోర్లను మంజూరు చేయడంతో గ్రామస్థులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు,మాజీ జడ్పీటిసి ఆర్.సంతోష్ కుమార్,ఒడిల రాజన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాలి మధు, తుమ్మిడి లచ్చయ్య,తిరుపతి రెడ్డి, లింగాగౌడ్, చెన్నూరి పురుషోత్తం, కామెర గణేష్, కామెర మల్లేష్, గండ్ర పురుషోత్తం, ఎన్నం సంజీవ్, ఎన్నం లింగయ్య, గుదేపెల్లి గణపతి, ఎల్కరి విజయ్ కుమార్, సతిపతి కవికుమార్, కొంపురి రమేష్, కొంపురి అంజన్న, కామెర మల్లేష్, ఎల్కరి చుక్కారావు, జంబోజీ మహేందర్, అంబాల శ్రీనివాస్, ఓలి మహమ్మద్, కొటారి తిరుపతి, ముంజం శ్రీనివాస్, ముంజం శ్రీనివాస్, ముంజం రాజారాం, చెన్నూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News