- కేఎల్ఆర్
- జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
- ఆర్కేపురం డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు
నేటి సాక్షి, ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధి ఆర్కేపురం డివిజన్ లో సీసీ కెమెరాలు, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జీమ్స్, పార్కుల్లో మౌలిక సదుపాయాలపై డివిజన్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిశారు. తుక్కుగూడ కేఎల్ఆర్ కార్యాలయంలో పలు కాలనీల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని సమస్యలు లేని మహానగరంగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు కేఎల్ఆర్. ఆర్థికమంత్రిని ఒప్పించి.. ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కిచ్చెన్న హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ నగర్ లో నెలకొన్న సమస్యలు తీర్చేందుకు స్వయంగా పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆర్కేపురం పురప్రముఖులు పాల్గొన్నారు.





