Thursday, April 2, 2026

పగటి పూట ఇల్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలో తాగుడుకు, జల్సాలు, కోడి పందేలు ఆడుటకు ఆడటం, ఇతర వ్యసనాలకు అలవాటుపడి త్వరగా ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలని తప్పుడు దారిలో గొర్రెల దొంగతనం చేసి పోలీసులకు పట్టుడి జైలుకు వెళ్ళిన సంఘటన పానగల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.గతంలో జైలుకు వెళ్ళిన సమయములో జైలులో జడ్చర్లకు చెందిన మూర్తి పరిచయమయ్యిడు. తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనం చేస్తే బంగారు, వెండి వస్తువులు, నగదు దొరుకుతాయి. బంగారు, వెండి వస్తువులను అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించాడు. అతని మాటలకు ఆశపడిన నిందితులను పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్ళపై రెక్కి నిర్వహిస్తారు. పథకం ప్రకారం ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, నగదును దొంగిలించుకు పోవడం అలవాటుగా మార్చుకున్నారు.నేరస్తుల వివరరాలు,ఎ 1 జలగరి ముత్తు S/o లేట్ ఆనంద్, వయసు: 31 సంవత్సరాలు, కులం: జలగరి, వృత్తి: మేస్త్రి, R/o ప్యాటగడ్డ, వనపర్తి టౌన్,ఎ 2 దుల్లోల రాజు s/0 చంద్రయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: తెలుగు, వృతి: మేస్త్రి, R/o గాంధీనగర్ కాలనీ, వనపర్తి టౌన్. ఎ 3 బొల్లిమోని అంజి @ స్వామి s/0 శ్రీనివాసులు, వయసు: 26 సంవత్సరాలు, కులం:బోయ, వృత్తి: మేస్త్రి మరియు డ్రైవర్ R/o శ్రీనివాసపురం గ్రామం వనపర్తి మండలం.ఎ 4 కిట్టు పై వ్యక్తులు చేసిన నేరములు: 16 దొంగతనం కేసులు వనపర్తి జిల్లాలో, 08 దొంగతనం కేసులు నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ మండలాల్లో పాల్పడి బంగారు, వెండి, నగదులను దోచుకున్నారు. ఈ విధంగా దొచుకున్న సొమ్మును జల్సాలకువినియోగించుకున్నారు. నేరస్తుల నుండి స్వాదీనం..5 తులాల బంగారం, 3 లక్షల రూపాయలు. స్వాధీనం,నేరస్తులను పట్టుకుని, వారి నుండి నగదును మరియు బంగారు వస్తువులను స్వాదీనం చేసుకోవటానికి సహకరించిన పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ అభినందించి నగదు రివార్డు అందజేశారు.సిసిఎస్ సీఐ, రవిపాల్, వనపర్తి సీఐ,కృష్ణ, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సై, జలంధర్ రెడ్డి, చిన్నంబావి ఎస్సై, జగన్ వీపనగండ్ల ఎస్సై, రాణి, సిసిఎస్ ఎస్సైలు,జయన్న, రామరాజు. ఏ ఎస్సై, తిరుపతి రెడ్డి , ఐటి కోర్ సిబ్బంది, గోవింద్ మురళి కానిస్టేబుళ్లు, మురళి,సమరసింహా రెడ్డి, అభిషేక్, రాజ మోహన్,నవీన్ గౌడ్,రాంగోపాల్ వర్మ, అశోక్,అరవింద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News